22-11-2025 07:20:08 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శనివారం ఘర్ సంపర్క్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జ్యోతినగర్ బస్తీలోని శ్రీ మహాలక్ష్మి–గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద స్వయంసేవకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కడ పంత్రం, స్టిక్కర్లు, చిన్న పుస్తకాలతో కలసి భక్తులకు పంపిణీ చేయడంతో పాటు కలియుగ ప్రత్యక్ష దైవం ముందు పూజాచరణ సాగించారు. అనంతరం జట్టు జట్లుగా విభజించుకుని బస్తీలో ఇంటింటా తిరిగి “ఘర్ సంపర్క్” కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలను కలసి సంఘం సేవా కార్యక్రమాలు, సంస్కార విలువలను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పాకా సత్యనారాయణ జీ, మండల్-2 అశోక్, రాగి సత్యనారాయణ, గాలిపెల్లీ శంకరయ్య, వంగల రవికుమార్, ఎన్నం ప్రకాశ్, గోలి సత్యనారాయణ రెడ్డి ఇతర స్వయంసేవక్ సంఘ్ సేవకులతో కలిసి పాల్గొన్నారు.