calender_icon.png 22 November, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

డయాగ్నస్టిక్ సెంటర్, తంగళ్లపల్లి పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

22-11-2025 07:25:31 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి చెందిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్, తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌లో నిర్వహిస్తున్న రక్త నమూనా పరీక్షలు, రిజిస్టర్లు పరిశీలించిన జిల్లా వైద్యాధికారి ప్రజలకు సరైన రిపోర్టులు అందించి వ్యాధులను అరికట్టడంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుకోవాలంటూ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే తంగళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాల రిజిస్టర్లను పరిశీలించారు. చిన్నపిల్లల తల్లిదండ్రులకు వ్యాధి నిరోధక టీకాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించి, పిల్లలకు సకాలంలో టీకాలు ఇవ్వాలంటూ మండల వైద్యాధికారి డాక్టర్ స్నేహ, ఆరోగ్య సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.