calender_icon.png 22 November, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

గండిలచ్చపేటలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ

22-11-2025 07:28:08 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ పోల్స్‌ను పునర్నిర్మాణం చేసి మళ్లీ విద్యుత్ సరఫరాను ప్రారంభించామని సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. ఈ పనులకు మొత్తం రూ.2,50,000 వ్యయం చేసినట్లు వెల్లడించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. రైతులు నాసిరకం మోటార్లు ఉపయోగించకుండా, నాణ్యమైన మోటార్లను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సెస్ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.