22-11-2025 07:22:24 PM
అర్మూర్ (విజయక్రాంతి): అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేసినట్లు అర్మూర్ ఎస్.హెచ్.ఓ. సత్యనారాయణ తెలిపారు. శనివారం ఉదయం కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి పెర్కిట్లో అక్రమముగా ఇసుకను డంప్ చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. టీఎస్ 07UG2419, టీఎస్ 16UA0007, టీఎస్ 16UB7717, టీఎస్ 16UB9413 నెంబర్ల గల లారీలను పట్టుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.