calender_icon.png 1 September, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎకరానికి 25 వేల నష్టపరిహారం ఇవ్వాలి

01-09-2025 07:35:10 PM

భైంసా: నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదల్లో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25000 ప్రభుత్వం చెల్లించాలని మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సోమవారం లోకేశ్వరం మండలంలోని పంచ కూడా ధర్మోరా అబ్దుల్లాపూర్ మౌల తత్ర గ్రామాల్లో గోదావరి వరదలో ముంపు గురై పంటలను పరిశీలించి రైతులను నష్టం అడిగి తెలుసుకున్నారు.

పంట నష్టం అధికారులు పక్కగా నిర్వహించి పరిహార అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు నష్టం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని వారికి ప్రభుత్వం సహాయం చేయని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు