01-09-2025 07:32:31 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): నూతనంగా ఏర్పాటైన సాయిశ్రీ లయన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్, సోమవారం జ్యోతినగర్ లోని శ్రీనిధి చీట్స్ సమావేశ మందిరంలో క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్, రీజనల్ చైర్మన్ ఊకంటి సంపతి కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు ధ్యావ స్వాతి రెడ్డి, కార్యదర్శి కొండం రజిత రెడ్డి, కోశాధికారి పాత దీపికను గవర్నర్ సింహరాజు కోదండరాం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ, సమాజానికి సేవ చేసే గుణం ఉన్నవారే క్లబ్ లో జాయిన్ అవుతారని నూతనంగా ఏర్పడిన మహిళా క్లబ్,సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్టిపుల్ చైర్మన్ హనుమన్ల రాజి రెడ్డి, మొదటి గవర్నర్ మోర భద్రేశం, రెండవ ఉప గవర్నర్ గుంటుక చంద్రప్రకాష్, క్యాబినెట్ సెక్రటరీ సింగిరెడ్డి, వాసుదేవ రెడ్డి, కోశాధికారి గాలి పల్లి వెంకట్, మైక్రో క్యాబినెట్ వెంకటరమణారెడ్డి, డిస్టిక్ మహిళా కోఆర్డినేటర్ బోయిన్పల్లి సరళ, జెడ్ సి చాడ మల్లారెడ్డి, ఆర్ సి ఎం.చక్రధర్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.