28-09-2025 10:11:43 PM
అమీన్ పూర్: శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ మల్లారెడ్డి కాలనీలో ఏర్పాటుచేసిన అమ్మవారి మండపాలను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందారం రమేష్ గౌడ్, నందారం శ్రీనివాస్ గౌడ్, ఇంద్రేశం జ్ఞానేశ్వర్, నందారం భరత్ గౌడ్, నందారం సందీప్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.