27-12-2025 06:52:27 PM
- గ్రామ సర్పంచ్ రజిత పరశురాం
జగదేవపూర్,(విజయక్రాంతి): అంగన్వాడి కేంద్రాలోనే పౌష్టికహారం అందుతుందని గ్రామ సర్పంచ్ కుడుదుల రజిత పరశురాం అన్నారు. శనివారం జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రజిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహరం అందుతుందన్నారు.
పౌష్టికాహారం తోనే తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. ఆరేళ్లు లోపు పిల్లలను తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని కోరారు. అంగన్ వాడి ద్వారా వచ్చే పౌష్టికారం గర్భిణీ స్త్రీలు తప్పకుండా తీసుకోవాలని పౌష్టికాహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. అనంతరం నూతన సర్పంచి రజితను అంగన్వాడి టీచర్ సాల్వతో సత్కరించారు. కార్యక్రమంలో టీచర్ రుక్మిణి, ఆయా బాలమణి తదితరులు పాల్గొన్నారు.