02-09-2025 03:01:06 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): వినాయక నవరాత్రులను పురస్కరించుకుని క్యాతనపల్లి మున్సిపాలిటీ 5వ వార్డు అమరవాది గ్రామంలో ప్రతిష్ఠించిన గణనాథుడి మండపాన్ని మంగళవారం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Former MLA Balka Suman) దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజీవ్ చౌక్ ఏరియాలో ఏర్పాటు చేసిన అప్పుడే మంచిగా ఉండే మా గ్రామం నుంచి పోరాటం అనే కార్యక్రమనికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. గణనాథుడి కృష్ణతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజా రమేష్,జీలకర మహేష్,సత్తయ్య లు పాల్గొన్నారు.