calender_icon.png 4 December, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫౌండర్ ప్యానల్ గ్రాండ్ పబ్లిక్ మీటింగ్

04-12-2025 12:00:00 AM

ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్  ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు 2025 ప్రచారంలో భాగం గా, ఫౌండర్ ప్యానల్ చైర్మన్ అభ్యర్థి భాంగడియా కైలాష్ నారాయణ నేతృత్వంలో బేగం బజార్‌లోని మహేశ్వరి భవన్‌లో గ్రాండ్ పబ్లిక్ మీటింగ్ జరిగింది. యూవర్ విజన్, యూవర్ బ్యాంకు, యూవర్ టీం అనే థీమ్తో జరిగిన ఈ సభకు సభ్యులు, షేర్‌హోల్డర్లు, వ్యాపార వర్గాలు, మహేశ్ బ్యాంక్ మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ముఖ్య అతిథి ఎమినెంట్ సోషల్ వర్కర్, ఎగ్జోరియల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఎండీ భాగవతీదేవి బాల్ద్వా, సహకార బ్యాంకింగ్‌లో నమ్మకం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఫౌండర్ ప్యానల్ ప్రజల హితాన్ని ముందుంచే నాయకత్వాన్ని ప్రతిబింబిస్తోందని, సభ్యులు బాధ్యతాయుతంగా ఓటు వేసి నైతిక నాయకత్వాన్ని బలో పేతం చేయాలని పిలుపునిచ్చారు. భాంగడియా కైలాష్ నారాయణ, మహేశ్ బ్యాంక్ సభ్యుల నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.

గతంలో చోటుచేసుకున్న అవకతవకలు తిరిగి జరగకుండా కఠినమైన పాలనా వ్యవస్థ అవసర మని చెప్పారు. ఫౌండర్ ప్యానెల్లోని 12 మంది జనరల్ కేటగిరీ అభ్యర్థులు, ఇద్దరు మహిళా కేటగిరీ అభ్యర్థులు మొత్తం 14 మంది అభ్యర్థులందరికీ వేర్వేరు బ్యాలెట్ల ద్వారా ఓటు వేయాలని సభ్యులను కోరా రు. ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాం క్ ఎన్నికలు ఈ నెల 7న జరుగనున్నాయి.

పోలింగ్ కేంద్రాలు నంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (నుమాయిష్ మైదానం)లోని సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయం, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ విమెన్. హైదరాబాద్ వెలుపల ఉన్న సభ్యులు తమ సమీప శాఖలైన ఖమ్మం, కరీంనగర్, వరంగల్, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, ముంబై, భిల్వారా, జైపూర్ శాఖల్లో ఓటు వేయవచ్చు. సభ్యులు ప్రభు త్వం జారీ చేసిన అసలు ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి.