calender_icon.png 28 September, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విప్లవ వీరుడు భగత్ సింగ్ బాటలో యువత నడవాలి..

28-09-2025 06:46:24 PM

బెల్లంపల్లి అర్బన్: షాహిద్ భగత్ సింగ్ 118 జయంతి వేడుకలు ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని రామ టాకీస్ సెంటర్ లో భగత్ సింగ్ విగ్రహానికి ఎంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శి, ఎఐఎఫ్డిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి, బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి, నూనూగు మీసాల చిన్న వయసులోనే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిసి బ్రిటిష్ పార్లమెంటు పైన బాంబులు కురిపించి చిరునవ్వులు చిందిస్తూ ఉరికొయ్యలను ముద్దాడారన్నారు.

ఇంక్విలాబ్ నినాదాన్ని దేశ యువత, ప్రజలకు అందించిన భగత్సింగ్ విప్లవ బాటలో పయనించాలన్నారు. ఈనాటికీ స్వాతంత్య్రం, ఆ అమరుల కలలు నెరవేరలేదన్నారు. అధికార మార్పు మాత్రమే జరిగిందని, తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని పేర్కొన్నారు. ప్రజల బ్రతుకుల్లో అనువంతైన మార్పు రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎఐఎఫ్డివై రాష్ట్ర ఉపాధ్యక్షులు పసులేటి వెంకటేష్, ఎంసిపిఐ(యు) పార్టీ పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, తోగరి రాహుల్, సంజయ్, సునీత్ తదితరులు పాల్గొన్నారు.