28-09-2025 06:42:41 PM
డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించిన రైతులు
కామారెడ్డి జిల్లా అన్నారంలో ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): పౌల్ట్రీ సప్లయర్ పౌల్ట్రీ రైతుల నుంచి కోళ్లను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఆందోళన చేసిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక పౌల్ట్రీ రైతుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రైతుల నుంచి కోళ్లు తెచ్చుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందుల గురి చేస్తున్న ఓ పౌల్ట్రీ సప్లయర్ ఇంటి వద్ద బాధిత రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సల్మాన్, సిద్దిపేట జిల్లా నిజాంపేట మండలం బొంపల్లికి చెందిన సాజిద్ నుంచి సల్మాన్ కోళ్లు తెచ్చుకొని ఆ కోళ్లను కంపెనీలకు తరలిస్తుంటాడు. సాజిద్, సల్మాన్ ఇద్దరు ఒకే వ్యాపారం చేస్తుండే వారు. సాజిద్ రైతుల నుంచి కోలు తీసుకొని సల్మాన్కు విక్రయిస్తుంటాడు. కంపెనీ నుంచి సల్మా సల్మాన్ నుంచి సాజీద్ సాజీ నుంచి రైతులకు డబ్బులు చేరేవి. అయితే కొద్ది రోజులుగా కంపెనీ నుంచి వచ్చిన డబ్బులను తీసుకుంటున్న సల్మాన్, సాజీద్ కు ఇవ్వడం లేదు. దీంతో దీంతో సాజీదుకు కోళ్ళు ఇచ్చిన రైతులు డబ్బుల కోసం ఇంటికి రావడం మొదలుపెట్టారు.
దాంతో ఇటీవల డబ్బులు ఇవ్వాలని సల్మాన్ దగ్గరికి సాజీదు రాగా డబ్బులు ఇచ్చేది లేదు ఏమి లేదు ఏం చేసుకుంటావో చేసుకో అని అతన్ని కార్ తో ఢీకొనగా గాయాలైనట్లు సాజిద్ తెలిపారు. 15 రోజుల నుంచి తాను కామారెడ్డి లోనే ఉంటున్నాను రైతుల ఇబ్బందులు పెడుతుంటే నేరుగా అన్నారం గ్రామంలోని సల్మాన్ ఇంటికి రైతులను తీసుకువచ్చినట్లు తెలిపారు. తాను ఒకడినే వస్తే తనను ఏమైనా చేస్తాడని భయంతో రైతులతో కలిసి వచ్చినట్లు తెలిపారు. 20 మంది రైతులకు 34 లక్షల రూపాయలు కోళ్లకు సంబంధించిన డబ్బులు రావాల్సి ఉందని రైతులు తెలిపారు. తమ నుంచి కోళ్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నా సల్మాన్ ఇంటి ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రామస్తులు కలుగజేసుకొని రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని తెలిపారు. సాజిద్, సల్మాన్ లు తమ వ్యాపారం లెక్కలు చేసుకొని రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని గ్రామస్తులు సూచించారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.