calender_icon.png 29 July, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు

29-07-2025 01:19:06 AM

  1. జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్
  2. సుప్రీం కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం
  3. హైకోర్టులో 30కి పెరిగిన జడ్జీల సంఖ్య

న్యూఢిల్లీ, జూలై 28: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపిం ది. న్యాయవాదులైన జస్టిస్ గౌస్ మీరా మొ హియుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టి స్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌లను హైకోర్టు జడ్జీలుగా నియ మించాలంటూ సుప్రీంకోర్టు కొలీజి యం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

తాజాగా సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ము ర్ము కొలీజియం ప్రతిపాదించిన పేర్లను ఆ మోదం తెలపడంతో ఈ నలుగురు హైకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టులో 42 మంది జడ్జీలకు ప్రస్తుతం 26 మంది ఉండగా.. తాజాగా నలుగురు కొత్తవారు రావడంతో ఈ సంఖ్య 30కి పెరిగింది. మొత్తంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, గుహవాటి హైకోర్టులకు కలిపి 19 మంది కొ త్త జడ్జీలు, అదనపు జడ్జీలు నియమితులవనున్నారు.

మధ్యప్రదేశ్‌కు హైకోర్టుకు న్యాయవాదులైన జస్టిస్ పుష్పేంద్ర యాద వ్, జస్టిస్ ఆనంద్ సింగ్ భహ్రావత్, జస్టిస్ అజయ్ కుమార్ నిరంకారి, జస్టిస్ జై కుమార్ పిళ్లు, జస్టిస్ హిమాన్షు జోషి, జస్టిస్ జ్యూడిషియన్ అధికారులు రామ్‌కుమార్ చౌబే, రాజేశ్ కుమార్ గుప్తాలు జడ్జీలుగా నియమితులవ్వగా..

జ్యూడిషియల్ అధికారులు అలోక్ సరస్వతీ, రత్నేశ్ చంద్ర సింగ్, భగవతి ప్రసాద్, ప్రదీప్ మిట్టల్ అదనపు జడ్జీలుగా రానున్నారు. ఇక గుహవాటి హైకోర్టుకు న్యాయవాదులు జస్టిస్ అజన్ మోనీ కలితా, రాజేశ్ మజుందార్, జ్యుడిషియల్ అధికారులు ప్రాంజల్ దాస్, సంజీవ్ కుమార్‌లు అదనపు జడ్జీలుగా నియమితులయ్యారు.

గౌస్ మీరా మొహియుద్దీన్: 

హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన గౌస్ మీరా మొహియుద్దీన్ 1969లో జన్మించారు. 1993లో ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేయడంతోపాటు ప్రత్యేక తెలంగా ణ హైకోర్టు ఏర్పడిన తర్వాత తెలంగాణ బార్ కౌన్సిల్‌గా కొనసాగుతున్నారు.

సుద్దాల చలపతిరావు: 

జనగామకు చెందిన సుద్దాల చలపతిరా వు 1971 జూన్ 25న జన్మించారు. 1998 లో ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ చేసుకున్న ఆయన న్యాయ వాది వై. రామారావు చాంబర్స్‌లో జూనియ ర్ లాయర్‌గా పనిచేశారు. హైకోర్టు, రంగారె డ్డి, సిటీసివిల్ కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీ స్ చేశారు. 

వాకిటి రామకృష్ణారెడ్డి:

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. బీకాం,ఎల్‌ఎల్‌బీ పూ ర్తి చేసిన ఆయన 1997లో న్యాయవాదిగా ఏపీ బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకు న్నా రు. 2005 నుంచి ప్రాక్టీస్ ప్రారంభించి న రామకృష్ణారెడ్డి ఉమ్మడి ఏపీ హైకోర్టు, తెలంగాణ, ఏపీ హైకోర్టులు, సిటీ సివిల్, రం గారెడ్డి, సికింద్రాబాద్ కోర్టుల్లో ప లు కేసులు వాదించారు. పలు కేంద్ర ప్రభు త్వ సంస్థల కు ప్రాతినిధ్యం వహించిన ఆయ న ప్ర స్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈ డీ) త రఫు న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

గాడి ప్రవీణ్‌కుమార్:

గాడి ప్రవీణ్‌కుమార్ నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 1971లో జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ, ఉస్మాని  యా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1998లో ఏపీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకు న్న ప్రవీణ్ కేంద్రంలోని రక్షణ, హోం, కా ర్మిక, ఉపాధి శాఖల తరఫున ప్రాతినిధ్యం వ హించారు. ప్రస్తుతం ప్రవీణ్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.