29-07-2025 01:28:38 AM
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజె క్టు సవరించిన అంచనాలకు తెలంగాణ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అభ్యర్థన మేరకు సోమవారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూ.13,058కోట్ల నుంచి సవరించిన అంచనాలు రూ.19,325 కోట్లకు అనుమతినిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
2016 ఫిబ్రవరిలో ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ .7,900 కోట్లు. అప్పటి ప్రభుత్వం 2018 లో రూ.13,058కోట్లకు అంచనా వేసిం ది. నిర్మాణ వ్యయంతో నీటి విడుదల సామర్థ్యం 4,500క్యూసెక్కుల నుంచి 9వేలకు పెరిగింది. ప్రస్తుతం సవరించిన అంచనాలు రూ.19,325కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మరో మూడు జిల్లాల్లో గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి.
3,45,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుంది. అంచనాల సవరింపుతో మూడు జి ల్లాలు, 11 నియోజకవర్గాలకు లబ్ధి చేకూరనుంది. ప్రధాన పంట కాలువలు అన్ని ఆధునీకరణ, మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సస్య శ్యామలం కానుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయనిగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిలుస్తుందని, సవరించిన అంచ నాలకు ఆమోదం తెలపాలని మంత్రి తు మ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గతంలో కోరారు. ఈమేరకు సవరిం చిన అంచనాలకు ఆమోదం తెలిపి శరవేగంగా పనులు ప్రారంభించాలని సీఎం సూ చించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా గో దావరి జలాలతో సస్యశ్యామలం కానుంది.
మంత్రి తుమ్మల కృతజ్ఞతలు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా సహచర మంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు నిత్యం పనిచేస్తోందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సవరించిన అంచనాలతో లక్షలాది ఎకరాల బీడు భూముల రూపురేఖలు మారనున్నాయని తుమ్మల పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతాయని ప్రతీ ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. తెలంగాణ చరిత్రలో ఈ ప్రాజెక్టు అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందన్నారు.