calender_icon.png 29 July, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబోయ్ కరెంటు కోతలు..

29-07-2025 01:18:48 AM

  1. విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనం
  2. వేళాపాళాలేని అప్రకటిత కో తలతో ప్రజల ఇక్కట్లు
  3. చినుకు పడ్డా.. గాలి వీచినా అంతే..
  4. చీటికి మాటికి సరఫరాలో అంత రాయం

మణుగూరు,జులై 28,( విజయ క్రాంతి ) : పట్టణంలో వేళాపాళా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు ప్రజలను ఇబ్బందులకు గు రి చేస్తున్నాయి. విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రతిరోజు విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. తరుచూ ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాలతో ప్ర జలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. క రెంటు ఎప్పుడు వస్తుందో..

ఎంతసేపు ఉం టుందో తెలియని దుస్థితి నెలకొంది. గంటల తరబడి కరెంట్‌పోతుండడంతో అప్రకటిత విద్యుత్ కోతల పైన ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. వేళాపాళా లేకుం డా విద్యుత్ సరఫరా నిలిచి పోతుండంతో మండల పరిధిలోని గ్రామాల్లో సైతం కరెం టు కష్టాలు కనిపి స్తున్నాయి. రోజుకు 10 నుంచి 20 సార్లు కరెంటు పోయి.. రావడం తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.

అప్రకటిత కోతలు

మండలంలో విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందొ తెలియదు. ప్రతిరోజూ సరఫరా లో అంతరాయం నిత్య కృత్యంగా మారింది. సబ్ స్టేషన్ పరిధిలో గంట గంటకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. పగలు కూడా ఎప్పుడు తీస్తారో, ఎ ప్పుడు ఇస్తారో తెలియలేని గందరగోళ పరిస్థితి నెలకొంది. గత 15 రోజుల నుండి తీవ్ర మైన విద్యుత్ కోతలు కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు  తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.

ఆసుపత్రిలో సైతం రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాత్రి సమయంలో కరెంటు పోవడం తో ఉక్కపోత, దోమల దండయాత్ర కారణంగా నిద్ర లేక మళ్లీ ఉదయం తమ పనుల కు వెళ్లలేకపోతున్నా మని పలువురు వాపో తున్నారు. కరెంటు కోతలు లేవం టూ నే అనధికారిక కోతలు విధి స్తుండడంతో ప్రజ లు మండిపడు తున్నారు.

చినుకు పడ్డా.. గాలి వీచినా అంతే..

33 కెవివిద్యుత్ సబ్స్టేషన్లలో నిర్వహణ పనులు,విద్యుత్లై న్లపై చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర మరమ్మతు పనుల సమయం లో అధికారులు పత్రికా ప్రకటనలిచ్చి అధికారికంగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తు న్నారు. అవి అధికారిక కరెంట్ కోతలు కానీ రోజంతా ఎడతెరిపి లేకుండా కరెంటు నిలిపివే యడాన్ని ఏమనాలని స్థానికులు కొంద రు ప్రశ్నిస్తు న్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా  విద్యుత్ సరఫరా నిలుపుదల 

చేయడం అనధికార కోత కాక మరేంటని, జనం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్నారు. కరెంటు పోవడం రొటీన్ గా మారిందని మండి పడుతున్నారు. ఫీడర్ల పై లోడు పెరగడంతోనే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అనధికారికం గా సిబ్బంది పేర్కొంటున్నారు. గతంలో వ ర్షాకాలం,గాలిదుమారాలకు సైతం ముందస్తుప్ర ణాళికలు ఉండేవి అని, ప్రస్తుతం అవేమి పట్టనట్లు అధికారులు, సిబ్బంది వ్యవహరి స్తున్నారని వినియోగదారులు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపాటి వర్షా లు, గాలి దుమారం ఏర్పడినప్పుడు గంటల కొద్దీ సరఫరాలో అంతరాయం ఏర్పడుతు న్నదని, కొన్ని సార్లు రాత్రులంతా నిద్ర లే కుండా గడు పుతున్నామని, ప్రజలు చెబుతుండగా, అధికారుల సరైన పర్యవేక్షణ, ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో సమస్య మరింత జఠిలం కావడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.

నిత్యం పవర్ సరఫరారలో అంతరాయాలకు కారణం ఏమిటనే ప్రశ్నలు ప్రస్తుతం చ ర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రభు త్వం నిరంతరాయ విద్యుత్ సరఫరా జరపాలని చెబు తున్నప్పటికీ అప్రకటితంగా వి ద్యుత్తు కోతలు ఎందుకు కొన సాగుతున్నా యి. అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరి లోనూ మెదులు తున్న ప్రశ్నలు. చాలా ప్రాంతాల లో పవర్ కట్ నిత్యకృ తంగా మారిందని ప్ర జల నుంచి అసహనం వ్యక్తం అవుతుంది.

కరెంటు లేక ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిర వుతున్నామని, అసలు నిర్దిష్టంగా కరెంటు ఎప్పు డు తీస్తారో... తీశాక ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం ఉందని, జనం గగ్గోలు పెడుతున్నారు. మరో వైపు విద్యుత్ సరఫరా  హె చ్చుతగ్గులు కూడా ఉండడంతో గృహోపకరణాలు పాడవు తున్నాయని పలువురు వా పోతున్నారు.

తరచుగా కరెంటు వస్తూ, పో తూ ఉండడంతో ఇండ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర విద్యుత్ వస్తువులు చెడిపోతు న్నాయని ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఇ ప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని నిరంతరం కరెంటు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మండల, పట్టణ వాసులు కోరుతున్నారు.సాంకేతిక లోపాలతోనే అక్క డక్కడ సమస్యలు తలెత్తుతున్నాయని వాటి ని వెంటనే పరిష్కరిస్తున్నాం, ఇందుకుగాను ప్రతి ఉద్యోగి కంకణబద్ధులై పని చేస్తున్నారు. ప్రజలకు నాణ్య మైన సరఫరా, మెరుగైన సేవలు అందిం చడమే తమ శాఖ ప్రదాన లక్ష్యం

విద్యుత్ శాఖ ఇంచార్జి  ఏ డి బియ్యని ఉమారావు