calender_icon.png 13 November, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బారాముల్లా జిల్లాలో భారీ పేలుడు.. నలుగురు మృతి

29-07-2024 04:24:56 PM

బారాముల్లా: కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో సోమవారం జరిగిన పేలుడులో నలుగురు వ్యక్తులు మరణించిన విషాద సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్క్రాప్ డీలర్ ఆవరణలో పేలుడు సంభవించింది. మృతుల్లో స్క్రాప్ డీలర్ కూడా ఉన్నారు. అతను లడఖ్ నుండి ఆర్మీ స్క్రాప్‌ను కొనుగోలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు సంభవించినప్పుడు కొందరు వ్యక్తులు ట్రక్కు నుండి స్క్రాప్‌ను దింపుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

మరణించిన నలుగురిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలతో మరణించారని అధికారులు తెలిపారు. మృతులను నజీర్ అహ్మద్ నద్రూ (40), అజీమ్ అష్రఫ్ మీర్ (20), ఆదిల్ రషీద్ భట్ (23), మహ్మద్ అజార్ (25)లుగా గుర్తించారు. వీరంతా షేర్ కాలనీ వాసులు. పేలుడు ఖచ్చితమైన కారణం వెంటనే తెలియరాలేదు. ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని ఘటనాస్థలికి తరలించినట్లు అధికారులు తెలిపారు.