calender_icon.png 13 November, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభకు రానప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు..?

29-07-2024 03:36:04 PM

హైదరాబాద్: గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు పూర్తికి అదనంగా రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. డబ్బులు పోయినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తికాలేదని, రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రాజులా ప్రవర్తించారు. కానీ రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టకుండా యాదాద్రిలో ఎందుకు కట్టారు..? అని ప్రశ్నించారు. 

నన్ను ప్రశ్నించేది ఎవరు అనే అహంతో కేసీఆర్ ప్రవర్తించారని, రాజకీయ ప్రయోజనాలతోనే కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ సభకు వచ్చి మాట్టాడాాలని కోరుతున్నామన్నారు. సభకు రానప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు..?, ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్ కాకుండా వేరేవారు తీసుకోవచ్చుకదా..? అని ప్రశ్నించారు. అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని బయటకు తీసుకొచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వివర్శలు చేయడం సరికాదని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.