calender_icon.png 8 May, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

07-05-2025 10:48:57 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నకిలీ పత్తి విత్తనాల సరఫరా, రవాణాపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రానా ప్రతాప్ ఆధ్వర్యంలో ఎస్పీ డివి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం పెంచికల్పేట్ మండల శివారులో నకిలీ పత్తి విత్తనాలు వివిధ జిల్లాల నుండి తీసుకువచ్చిన విత్తనాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండడంతో మండల శివారులోని బ్రిడ్జి సమీపంలో పోలీసులు తనిఖీ చేపట్టగా రవాణా చేస్తున్న రెండు కార్లను అదుపులోకి తీసుకొని 12 లక్షల రూపాయల విలువచేసే నాలుగు క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనపర్చుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ మధు, రమేష్, మహమూద్, సిబ్బంది శేఖర్ తదితరులు పాల్గొన్నారు.