08-05-2025 12:00:00 AM
రైతు స్వరాజ వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న
బోథ్, మే 7 (విజయక్రాంతి): వర్షాల నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తూకం కాటాల సంఖ్యను, హమాలీల సంఖ్య ను పెంచి జొన్న పంటను కొనుగోళ్ళను త్వరితగతిన పూర్తి చేయాలని రైతు స్వరాజ వేదిక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్ర న్న డిమాండ్ చేశారు. బుధవారం బోథ్ మార్కెట్ యార్డులో పేరుకుపోయిన జొన్న పంట నిలువలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు.
హమాలీల కొరత ఉందని, తూకం కాటాలు లేవని పంట కొనుగోలు చేయకపోవడం సరికాదన్నారు. అకాల వర్షా లు, వడగండ్లు పడే అవకాశం ఉందని ఆం దోళన వ్యక్తం చేశారు. ఆయన వెంట రైతులు రామకృష్ణ, రమేష్, గంగయ్య, స్వామి, గంగాధర్ తదితరులు ఉన్నారు.