11-01-2026 12:00:00 AM
‘స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్’లో నిర్వహణ
ఖమ్మం, జనవరి 10 (విజయక్రాంతి): ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీలో గల స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో సంక్రాంతి సం బురాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల కేరింతల నడుమ, హరిదాసుల ఆటపా టలతో, భోగిమంటలతో అంబరాన్నంటేలా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. తల్లిదండ్రులను, గురువులను మరచిపోకుండా విద్యను అందించిన స్కూల్‌కు, తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకరావలంటూ రెజొనెన్స్ స్కూల్ శ్రీనగర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, సంస్కృతి, సాంప్రదాయలు అం దిస్తూ పండుగల గొప్పతనాన్ని తెలియజేస్తున్మాన్నారు.
డా. కొండా అన్విత మాట్లాడు తూ.. నాణ్యమైన విద్యను అందించడం రెజొనెన్స్ శ్రీనగర్ ప్రత్యేకత అంటూ నేను ఇదే స్కూల్‌లో చదివి నేడు డాక్టర్‌గా ఉన్నానని చెప్పారు. సాంస్కృతిక విలువలను నేర్చుకుంటూ ఉన్నతమైన చదువులు చదివి గొప్ప స్థాయికి వెళ్లాలని విద్యార్థులకు చెప్పారు. డైరెక్టర్ కొండా కృష్ణవేణి పాల్గొని, చిన్నారులకు భోగి పండ్లు పోసి, హారతి ఇచ్చి, హరి దాసులకు ధాన్యం దానం చేశారు.