17-08-2024 12:00:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 16: జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రూ. 4,000 కోట్లు సమీకరించేందుకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీవో) రానుంది. ఇందుకోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను కంపెనీ సమర్పించింది. ఐపీవో ద్వారా రూ.2,000 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీచేస్తుంది. ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో మరో రూ.2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తారు.
ఓఎఫ్‌ఎస్‌లో ఆసియా ఆపర్చూనిస్టిక్ హోల్డింగ్స్, సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ చెరో రూ. 937.5 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేయనుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.125 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తుంది. ఐపీవో ద్వారా సమకూరిన నిధుల్లో రూ. 800 కోట్లు రాజస్థాన్‌లో కొత్త సిమెంట్ ప్లాంట్ నిర్మాణానికి ఉపయోగిస్తుంది. మరో రూ.720 కోట్ల మేర రుణాల్ని చెల్లిస్తుంది.