calender_icon.png 23 September, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోండి

22-09-2025 11:14:44 PM

రవాణా శాఖ అధికారికి మొరపెట్టుకుంటున్న టూరిస్ట్ ఓనర్స్

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ కి చెందిన స్కూల్ బస్ లు విద్యార్థిని విద్యార్థులను పుణ్యక్షేత్రాలతో పాటు ఇతర ప్రదేశాలలో తీసుకెళ్తున్నారు. బస్సులో పరిమితికి మించి ఇస్టా రీతిలో సుమారు 70 మంది వరకు బస్సులో ఎక్కించుకొని వండర్లా మ్యూజియం పుణ్యక్షేత్రాలు తిప్పుతూ పరిమితికి మించి వేగంతో స్కూల్ బస్సులను నడుపుతున్నట్లు వారు తెలిపారు. ఈ విషయమై సోమవారం  జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.

ఇలా విచ్చలవిడిగా ప్రవేట్ స్కూల్స్ సంబంధించిన బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ తదితర ప్రాంతాలలో ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యం ఆధ్వర్యంలో ఈ బస్సులను నడుపుతున్నారని వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డిని కోరారు.లేనియెడల టూరిస్ట్ బస్సు అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.