calender_icon.png 13 July, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి త్రైమాసికంలో నిరుద్యోగం రేటు 6.6 శాతం

17-08-2024 12:00:00 AM

నేషనల్ శాంపుల్ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశంలోని పట్టణప్రాంతాల్లో నిరుద్యోగం రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ తొలి త్రైమాసికంలో 6.6 శాతంగా ఉన్నదని నేషనల్ శాంపుల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌వో) వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 15 సంవత్సరాలు పైబడిన ఉద్యోగ, కార్మికుల్లో ఉపాధిలేనివారి సంఖ్య ఆధారంగా నిరుద్యోగం రేటును ఎన్‌ఎస్‌ఎస్‌వో ప్రకటించింది. ఈ ఏడాది జనవరి త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.7 శాతం మేర ఉన్నదని, ఏప్రిల్ ఇది స్వల్పంగా తగ్గినట్టు తెలిపింది.

పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో నిరుద్యోగం 2024 ఏప్రిల్‌ెేజూన్‌లో గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 9.1 శాతం నుంచి 9 శాతానికి తగ్గింది. అయితే 2024 జనవరి త్రైమాసికంలో నమోదైన 8.5 శాతంకంటే పెరిగింది.  పురుషుల్లో నిరుద్యోగం రేటు నిరుడుతో పోలిస్తే ఈ తొలి త్రైమాసికంలో 5.9 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గగా, ఈ జనవరి నమోదైన 6.1 శాతం నుంచి కూడా దిగివచ్చింది.