calender_icon.png 23 September, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివ్వెంలలో సేవాలాల్ సేన నాయకుల ముందస్తు అరెస్టు

22-09-2025 10:58:13 PM

చివ్వెంల: సేవాలాల్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ భూక్య సంజీవ్ నాయక్ పిలుపు మేరకు, గిరిజన సంఘాల ఆందోళనలో భాగంగా చివ్వేంలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే కుట్రపూరిత విధానాలను ఎండగట్టేందుకు ఆందోళన చేపట్టాలని యోచించిన సేవాలాల్ సేన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

ఈ క్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ శివరాం నాయక్, భూక్య నాగు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ సేవ్యా నాయక్, జిల్లా కార్యదర్శి అశోక్ నాయక్లను పోలీసులు అదుపులోకి తీసుకుని చివ్వెంల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి. గిరిజన సమాజ హక్కులను హరించే విధానాలు ఆమోదయోగ్యం కావు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తాం” అని హెచ్చరించారు.గ్రామ, మండల స్థాయిలో ఇప్పటికే గిరిజన సంఘాలు చర్చలు ప్రారంభించగా, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.