calender_icon.png 23 September, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరంజీవిగా పేరు మారిన సినిమాకు 47 ఏళ్లు

22-09-2025 11:34:13 PM

అగ్రనటుడు చిరంజీవి తొలిచిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఆ సినిమా విడుదలై 47 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మెగాస్టార్ స్పందిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. “22 సెప్టెంబర్ 1978 ‘కొణిదెల శివశంకరవరప్రసాద్’ అనే నేను ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.. మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబసభ్యుడిగా, ఒక మెగాస్టార్‌గా అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్థమైన మీ ప్రేమ. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు చిరంజీవి.