22-09-2025 10:48:47 PM
ఉప్పల్,(విజయక్రాంతి): దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మీర్పేట్ హెచ్ బి కాలనీలో వెంకటేశ్వర నగర్ షిరిడి సాయిబాబా ఆలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారిని సోమవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాసు పన్నాల దేవేందర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఉప్పల్ నియోజకవర్గం ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.