17-08-2024 12:00:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 16: అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ సిస్కో మరో 6,000 ఉద్యోగాలను తగ్గించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 4,000 మంది ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చిం ది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తమ గ్లోబల్ సిబ్బందిలో 7 శాతాన్ని తగ్గించాలని ప్రతిపాదిస్తున్నట్టు సిస్కో యూఎస్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్‌కు తెలిపింది. లే ఆఫ్స్ ద్వారా 1 బిలియన్ డాలర్ల వ్య యాన్ని తగ్గించుకుంటున్నట్టు సిస్కో వెల్లడించింది. లేఆఫ్ ఇచ్చిన సిబ్బందికి టెర్మినేషన్ ప్రయోజనాలు అందించడానికి దాదాపు 700 నుంచి 800 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నట్టు పేర్కొంది.