22-09-2025 11:23:06 PM
అలంపూర్: జోగులాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సోమవారం ప్రారంభం కావడంతో రాత్రి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే విజయుడుకు ఆలయ ఈవో దీప్తి అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయం ముందు ఉన్న ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు ధ్వజారోహణముకు హారతి ఇచ్చి ఎమ్మెల్యే చేతులమీదుగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమని అలంపూర్ ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.