22-09-2025 11:11:58 PM
నర్సంపేట/దుగ్గొండి,(విజయక్రాంతి): పిడుగుపాటుకు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి పంచాయతీలో చోటుచేసుకుంది. చంద్రయ్య పల్లి గ్రామానికి చెందిన మొద్దు రాకేష్ (25) సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి తమ వ్యవసాయ భూమిలో పనిచేసేందుకు వెళ్లి వ్యవసాయ పని చేసుకుంటుండగా ఆకస్మాత్తుగా భారీ ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది.
దీంతో వ్యవసాయ బావి వద్ద ఉన్న కరెంటు మోటార్ ను బందు పెట్టడానికి వెళ్లే క్రమంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు . కొద్ది సేపటి తరువాత సమీపంలో ఉన్న మృతుడి తల్లిదండ్రులు అతడిని పరిశీలించగా.. అప్పటికే మృతి చెందిన తన కుమారుడు కళ్ళెదుటే విగత జీవిగా పడిపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమయ్యారు. రాకేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.