28-05-2025 01:05:46 PM
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో(Khammam district) దారుణం చోటుచేసుకుంది. పిచ్చి కుక్క కాటుకు గురైన నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో మే న చిన్నారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన చిన్నారికి కొన్ని రోజులుగా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్ లో బాలిక ప్రాణాలు కోల్పోయింది. బాలిక మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీది కుక్కల దాడిలో ప్రతి రోజు ఎక్కడో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలను బయటకు పంపే ముందు కుటుంబీకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.