calender_icon.png 6 July, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రెడిట్ లిమిట్ పెంచుతామంటూ మోసం

06-07-2025 12:28:26 AM

  1. రూ.2.03 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కేర్ అంటూ వృద్ధుడికి కుచ్చుటోపీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతా మంటూ ఆశ చూపి, హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడి ఖాతా నుం చి రూ. 2.03 లక్షలు మాయం చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. షేక్‌పేటలో నివాసముంటున్న 67 ఏళ్ల వృద్ధు డికి సైబర్ నేరగాళ్ల నుంచి ఓ వీడియో కాల్ వచ్చింది. తాము హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికారు.

“మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతాం. ఇందుకోసం మీకు ఒక లింక్ పంపుతున్నాం, దాన్ని ఓపెన్ చేసి స్క్రీన్ షేర్ చేయండి” అని కోరారు. వారి మాటలు నమ్మిన వృద్ధుడు, వారు పంపిన లింక్‌ను క్లిక్ చేసి, కాల్‌లో ఉండగానే తన వివరాలను నమోదు చేశాడు. వివరాలు ఎంటర్ చేయగానే, మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 2.5 ల క్షలకు పెరిగింది. 24 గంటల్లో ఇది అప్‌డేట్ అవుతుంది. అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశారు.

ఆ మరుక్షణమే బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.03 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన వృద్ధుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.