calender_icon.png 27 December, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీపురం కాలనీలో ఘరానా మోసం

27-12-2025 07:20:20 PM

కోదాడ: కోదాడ శివారు లక్ష్మీపురం కాలనీకు చెందిన  షేక్ ముంతాజ్ బేగం 12-04-2022న చనిపోయినది. మృతురాలి కుమార్తె నసీమ శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొంత మంది ముఠా నాయకులు ముంతాజ్ బేగం కూతురు అయిన షేక్ నసీమ వద్దకు వెళ్లి మీ అమ్మ కు లేబర్ కార్డు చేపిస్తా అని ఆమె దగ్గర 5000 వేలు తీసుకొని వెళ్ళినారు. తరువాత కొన్ని రోజులకు ఆమె వారిని అడగ్గా డబ్బులు వస్తాయని దాట వేశారు. కొన్ని రోజులకు నీకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ మీద 250000 లక్షలకు చెక్ వచ్చినది అని మా ఇంటికి బీమా అధికారులు వచ్చారు.

అయితే జరిగిన మోసం తెలిసినది ఏమనగా మా అమ్మ పేరున ఉన్న పాలసీ ని నేను చేయించమని  కాగితాలు ఇచ్చిన పెద్ద మనిషి నాకు తెలవకుండా మా అమ్మ చనిపోతే నామినుగా ఉన్న నా పేరును తొలగించి నా పేరుతో ఉన్న మరో నసీమను పెట్టి బీమా క్లెయిమ్ చేశారు. కావున నా యందు దయ ఉంచి నాకు నాయం జరిగే వరకు పోరడుతాను ఇట్టి విషయంను పోలిష్ వారికీ కంప్లైంట్ ఇస్తాను ఇలా ఎన్నో మోసాలు చేస్తున్న వారినుండి ప్రజలు అప్రమతంగా ఉండాలని నసీమ తెలిపారు. తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరుతున్నారు.