calender_icon.png 27 December, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గ్రామ పంచాయతీకి 20 ఇండ్లు మంజూరు చేయిస్తా..

27-12-2025 07:23:53 PM

ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి 

బెజ్జూర్,(విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 ఇండ్లు మంజూరు చేయిస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కాగజ్నగర్ మండలంలోని జంబుగా రైతు వేదికలో 23 మంది గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 రోజు లోపు ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలని లేనిపక్షంలో వారి ఇండ్ల కేటాయింపు రద్దుచేసి వేరే వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. పెంచికల్పేట్ మండలంలోని ఎలుకపల్లి రైతు వేదికలో 26 మంది గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి కొత్తగా 20 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.

సర్పంచులు రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. రాజకీయాలను పక్కకు పెట్టి అభివృద్ధిపై దృష్టి సాధించాలని సూచించారు. దహేగాం మండల కేంద్రంలోని రైతు వేదికలో 29 మంది గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగా గెలిచిన సర్పంచ్లకు పలు సూచనలు చేశారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి జరగాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సిసి రోడ్లు,డ్రైనేజీలు నిర్మాణాల కోసం నివేదిక పంపించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోటే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ, సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.