calender_icon.png 31 January, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ కళాశాలలో ఉచిత రక్త పరీక్షలు

31-01-2026 12:00:00 AM

నల్లగొండ టౌన్, జనవరి 30: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలకు ఉచిత థైరాయిడ్ రక్తపరీక్షలను శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వసంతకుమారి మాట్లాడుతూ హెచ్ పీవీ వైరస్లోని ప్రమాదకర రకాల నుంచి శరీరానికి రక్షణ ఇస్తుందని, సర్వకల్ కాన్సర్ నివారణలో చాలా ప్రభావవంతమైనది అని 9 నుండి 14 ఏళ్ల బాలికలు, బాలురకు అత్యంత అనుకూల వయసు, అని 15 నుండి 26 ఏళ్ల వరకు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఎలాంటి దుష్పరిమాణాలు ఉండవు అని తెలిపారు.

డాక్టర్ రాజేశ్వరి గారు మాట్లాడుతూ, HPV అంటే హ్యూమన్ పంపిల్లొమా వైరస్. ఇది చాలా మందికి తెలియకుండానే శరీరంలోకి ప్రవేశించే ఒక వైరస్ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో కనిపించే గర్భాశయ ముఖ క్యాన్సర్కు ప్రధాన కారణం ఇదే అని, దేశీయంగా కోట్ల మందికి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థినుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తోకల సుధారాణి మాట్లాడుతూ, క్యాన్సర్ను చికిత్స చేయడానికన్నా నివారించడమే ముఖ్యం అని, లైంగిక జీవితం ప్రారంభం కాకముందే వేయించుకుంటే అత్యుత్తమ రక్షణ లభిస్తుంది అని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ కళాశాలలో గ్రంథాలయ శాస్త్ర విభాగం, బయోటెక్నాలజీ విభాగం, మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ ఉచిత థైరాయిడ్ రక్త పరీక్షలు నిర్వహించడం, హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి విద్యార్థినిలకు అవగాహన కల్పించినందుకు డాక్టర్లను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ సుంకరి రాజారామ్, డాక్టర్ పుష్పలత, మరియు అధ్యాపకులు డాక్టర్ సాలయ్య డాక్టర్ మల్లీశ్వరి, కొమ్ము నరేష్, డాక్టర్ వసంత, డాక్టర్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.