31-01-2026 12:00:00 AM
పంజాగుట్ట పోలీసులకు అమెరికన్ వైద్యుల ప్రశంసలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): అమెరికాకు చెందిన వైద్యులు పోగొట్టుకున్న బ్యాగును పంజాగుట్ట పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి, వారికి సురక్షితంగా అప్పగించారు. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ ప్రసాద్, డాక్టర్ వాణి ఉదయం పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్కు క్యాబ్లో వచ్చారు. ఈ క్రమంలో రూ. 50 వేల నగదు, అత్యవసర పత్రాలు ఉన్న బ్యాగు కనిపించకుండా పోయింది. బాధితులు రిటైర్డ్ డీఎస్పీ రాజేశ్వర్ రావు ద్వారా పంజాగుట్ట ఏసీపీ మురళీ కృష్ణను ఆశ్రయించారు.
కేసు ను స్వీకరించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకట్.. తాను బదిలీపై వెళ్తున్నప్పటికీ, పూర్తి నిబద్ధతతో పనిచేశారు. సీసీటీవీ, మొబైల్ డేటా ఆధారంగా క్యాబ్ డ్రైవర్ను ట్రేస్ చేశారు. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా, పోలీసులు చాకచక్యంగా పట్టుకుని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నానికే తమ బ్యాగును అప్పగించిన పోలీసుల పనితీరు అద్భుతమని వైద్యులు కొనియాడారు.