10-07-2025 07:57:51 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): పట్టణంలోని స్థానిక భగత్ సింగ్ నగర్ ఏరియాకు చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులకు యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉచితంగా స్కూల్ బ్యాగ్ లను పంపిణీ చేశారు. యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ గత ఎనిమిది సంవత్సరలుగా పలు సేవ కార్యక్రమల ద్వారా పేదలకు, విద్యార్థులకు సహాయం అందించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. తమ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు అందిస్తున్న పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, సాగర్ రెడ్డి, గూడ సత్తన్న, కోక్కుల సతీష్, రవి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.