10-07-2025 07:47:40 PM
కోదాడ: మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామం శ్రీ సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు దేవాలయంలో నిర్వహించారు. అనంతరం దేవాలయ చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ, ఉదయం ఐదు గంటలకు కాగడ హారతి, 5:30 నుండి 6:30 వరకు స్వామివారికి ఆవుపాలు, చందన అభిషేకం కార్యక్రమం. ఏడు గంటలకి అలంకార దర్శనం, 11 గంటలకు గురుపూజ కార్యక్రమం, 12 గంటలకు మధ్యాహ్నం హారతి, 12 గంటల 30 నిమిషాలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు సంధ్యా హారతి , ఏడు గంటలకి పల్లకి సేవ, ఎనిమిది గంటలకి శేష హారతి కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సహకరించిన దాతల కు ధన్యవాదాలు తెలియజేశారు . భక్తులు సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముండ్ర రంగారావు, శరబయ్య ఏదులాపురం శ్రీనివాసరావు, రామచంద్రరావు , ముండ్ర నరసింహారావు, నర్రా వెంకటేశ్వర్లు శ్రీనివాస, నల్లపాటి శ్రీనివాసరావు, సీతయ్య, శివరామకృష్ణ, రమేష్, ఆదినారాయణ రామారావు, ప్రతాప్, సుధాకర్, నారాయణ, వెంకటేశ్వర్లు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.