28-01-2026 12:09:55 AM
చౌటుప్పల్, జనవరి 27 : ట్రాఫిక్ భద్రత లో భాగంగా వాహనదారులకు ఉచితంగా లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో బొబ్బిళ్ళ మురళి ఆర్థిక సహకారంతో మంగళవారం హెల్మెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని చౌటుప్పల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయమోహన్ ప్రారంభించి మాట్లాడారు. వాహనదారులు ఖచ్చితంగా భద్రత ప్రమాణాలు పాటించి రోడ్డుపై ప్రయాణం చెయ్యాలన్నారు. ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపవద్దన్నారు.
హెల్మెంట్ లేకుండా ప్రయాణం చేయడం ప్రమాదకరమన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందున్న లైన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవా సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవా అధ్యక్షులు తిరందాసు జగన్నాథం, ప్రధాన కార్యదర్శి ఆతారు పాషా, డిసి నెంబర్స్ గోషిక కరుణాకర్, ఉప్ప ఆంజనేయులు ,కాసుల వెంకటేశం, వనం రాజు, సత్యనారాయణ, చింతల ప్రభాకర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ సైదిరెడ్డి, ఏఎస్‌ఐ కాట్రగడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.