28-01-2026 12:11:11 AM
బండ్లగూడజాగీర్, జనవరి 27 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ సర్కిల్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పతాక స్థాయికి చేరా యి. అధికారుల అండదండలతో బిల్డర్లు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ‘అడిగినంత ఇచ్చుకో.. ఇష్టం ఉన్నట్లు నిర్మించుకో‘ అనే ధోరణిలో టౌన్ ప్లానింగ్ విభా గం పనితీరు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. భారీ భవనాల నిర్మాణంలో సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకపోగా, ఏకంగా రోడ్లను కబ్జా చేసి మెట్లు, ర్యాంపులు నిర్మిస్తున్నారు. దీనివల్ల రోడ్లు ఇరుకుగా మారి రాకపోకలకు సామాన్య ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు.
ఫిర్యాదులు వచ్చినా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయడం లేదు. బదులుగా, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న బిల్డర్లను కార్యాలయానికి పిలిపించుకుని, మధ్యవర్తుల ద్వారా భారీగా ముడుపులు తీసుకుని సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ’ఫీల్ విజిట్’ పేరుతో కొందరు అధికారులు విధులకు డుమ్మా కొడుతూ కార్యాలయానికి రాకపోవడం గమనార్హం.
ఇటీవల సంధ్య నగర్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసేం దుకు కార్యాలయానికి రాగా, అధికారులు అందుబాటు లో లేకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గతం లో ఇచ్చిన అనుమతులు, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు, అధికారుల ప్రైవేటు లావాదేవీలపై అవినీతి నిరో ధక శాఖ సమగ్ర విచారణ జరిపితే ఈ అక్రమ దందా బట్టబయలవుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు: డీసీ
బండ్లగూడ జాగీర్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ బి. సురేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారి ఒకరు తన అనుమతి లేకుండా కార్యాలయానికి రాలేదని ఆయన వివరించారు.
సీఎస్‌కు ఫిర్యాదు చేస్తాం
బండ్లగూడలో సాగుతున్న అక్రమ నిర్మా ణాలు, అధికారుల అవినీతిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తాం. అక్రమార్కుల ను ప్రోత్సహిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదు.
డాక్టర్ రాచాల యుగేందర్ గౌడ్