calender_icon.png 28 January, 2026 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ముంజంపల్లికి మీనాక్షి నటరాజన్, మహేష్‌కుమార్ రాక

28-01-2026 12:09:38 AM

మానకొండూరు, జనవరి 27(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కరీంనగర్ జిల్లాకు రానున్నారు. ఇటీవల కేంద్రం ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, నిధుల కోత విధించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగానే మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో ఉపాధి కార్మికులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమం పాల్గొంటారని టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ తోపాటు పలువురు నాయకులు  పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని డాక్టర్ కవ్వంపల్లి పిలుపునిచ్చారు.