calender_icon.png 5 May, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత కరాటే శిక్షణ ప్రారంభం

05-05-2025 12:44:28 AM

సద్వినియోగం చేసుకోవాలి  ఆలనూర్ స్కూల్ ప్రిన్సిపాల్ నజియా సుల్తానా

మహబూబ్ నగర్ మే 4 (విజయ క్రాంతి) : కింగ్ ఫోటోఖాన్ ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత కరాటే శిక్షణ శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఆలనూర్  హై స్కూల్ ప్రిన్సిపాల్ నజియా సుల్తానా అన్నారు. జిల్లా కేంద్రంలోని షాషాబ్ గుట్ట లో ఆలనూర్  హైస్కూల్ కింగ్ షోటోకన్ కరాటే డు ఇండియా ఫౌండర్ జహంగీర్ షాషా ఖాద్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 27వ వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరాన్ని ప్రిన్సిపాల్ నజియా సుల్తానా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సెల్ఫ్ డిఫెన్స్ కోసం బాలికలు మహిళలు కరాటే వంటి యుద్ధ విద్యలు నేర్చుకోవాలని కోరారు. ఉచిత శిక్షణ శిబిరంలో కరాటే యోగా కిక్ బాక్సింగ్ బాక్సింగ్ నేర్పించడం సంతోషంగా ఉందన్నారు.

ఇలాంటి కరాటే శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కింగ్ చోటకాన్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రి మాట్లాడుతూ బాలికలకు మహిళలకు ఆత్మ రక్షణ కోసం కరాటే శిక్షణ ఇస్తున్నామని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాజా పాషా, వైస్ చైర్మన్ చిన్న వీరయ్య, ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ, మహేష్ ఆమ్నా ఖాన్ ,మహమ్మద్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.