calender_icon.png 26 September, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకలవ్య గురుకుల విద్యార్థులకు బతుకమ్మ సంబరాలు

25-09-2025 10:49:53 PM

ఉత్తమ అలంకరణ చేసిన బతుకమ్మ నిర్వాహకులకు బహుమతులు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఏకలవ్య గురుకుల విద్యార్థులకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. గురువారం ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్ లో  నిర్వహించిన  కార్యక్రమానికి ఏకలవ్య అభియాన్ ఫ్రెండ్స్ ట్రైబల్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  రేఖ సర్ఫ్,  తెలంగాణ మహిళా అధ్యక్షులు తెలంగాణ మహిళా ప్రధాన కార్యదర్శి నీతి జి.మహిళా ఉపాధ్యక్షులు చందన, మండలంలోని పలువురు మహిళలతో బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దక్షిణ భారత్ దేశం ఇంచార్జ్ కే.రాఘవేందర్, ఏల్లారెడ్డి అధ్యక్షులు పండరినాథ్, ఎల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఎల్లారెడ్డి ఇంచార్జ్ కార్యకర్త వెంకట్ రాములు, ఉత్తర్ తెలంగాణ ఇంచార్జ్ రమాదేవి, ఉత్తర్ తెలంగాణ కార్యాలయ ఇంచార్జి కోమల, ఎల్లారెడ్డి ఇంచార్జి భూమారెడ్డి, కామారెడ్డి జి ట్రైనింగ్ అంజప్ప, ప్రవీణ్, బిజెపి నాయకులు ప్యాలాల రాములు పాల్గొన్నారు. 9 గ్రామాల నుండి షుమారు 150 మంది మహిళలు పాల్గొన్నారు. మొదటి బహుమతి ఎల్లారెడ్డిలోని మహిళలు రెండవ బహుమతి మిసన్ పల్లి, మూడవ బహుమతి  రెపల్లెవాడ మహిళలు గెలుపొందారు.