25-09-2025 10:40:43 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మెడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ వద్ద 7,40,400 క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగా మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులు తున్నట్లు అధికారులు తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాళేశ్వరం వద్ద మెట్ల పై నుండి గోదావరి ప్రవహిస్తున్నందున భక్తులు మెట్ల వద్దనే స్నానాలు ఆచరించాలని లోపలికి వెళ్లరాదని అధికారులు సూచించారు. అన్నారం బ్యారేజ్ దిగివన మద్దులపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు నిలిచి పోయినాయి. పత్తి మిర్చి చేన్లు గోదావరి నీటితో నిండి పోయినాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.