calender_icon.png 25 August, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌జెకేయం కళాశాలలో ఉచిత వైద్య శిబిరం

25-08-2025 01:28:56 AM

ఎర్రుపాలెం, ఆగస్టు 24 (విజయ క్రాంతి):మండల కేంద్రమైన ఎర్రుపాలెంలో ఎస్ జె కే యం కళాశాల నందు ప్రముఖ విద్యావేత్త జమలాపురపు గోపాల కిషన్ రావు జ్ఞాపకార్థం ఆదివారం నాడు మధిర హై కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హై కేర్ హాస్పిటల్ డాక్టర్స్ జి ఉదయ్ కిరణ్ రెడ్డి చిన్నపిల్లల వైద్యులు, పి తేజస్విని స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొని రోగులకు షుగర్, బిపి , జ్వరాలకు సంబంధించిన ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

అంతకుముందు గోపాల కిషన్ రావు కుమారుడు కమలాకర్ రావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ దండం సత్య నారాయణ రెడ్డి, భద్రాచలం దేవాలయ మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, కళాశాల ఇ న్చార్జి ప్రిన్సిపల్ నాగిరెడ్డి సౌజన్య, కళాశాల సిబ్బంది, హై కేర్ హాస్పిటల్ సిబ్బంది, ప్రజలు ,విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.