19-08-2025 07:43:44 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని కోరుతూ మంగళవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతి పత్రాన్ని అందించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రసం శ్రీధర్ ఆధ్వర్యంలో పాత్రికేయులు కలెక్టర్ జర్నలిస్టులు ఎదుర్కొండా సమస్యలను తెలిపి ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు ఇండస్థలాలను కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ వినతి అందించారు. తప్పకుండా అధికారులతో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి న్యాయం చేసేటట్లు చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు పాత్రికేయులు తెలిపారు.