19-08-2025 07:50:52 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రియదర్శిని నగర్ లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నిర్మల్ ప్రొఫెషనల్ ఫోటో,వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్ర పటానికి సంఘ సభ్యులంతా నివాళులు అర్పించారు. అనంతరం మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.