calender_icon.png 19 August, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

డిగ్రీలో కేయూ ర్యాంకర్ భార్గవికి సన్మానం

19-08-2025 07:54:52 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో ఎంసీసీఎస్ సబ్జెక్టులో అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణురాలై యూనివర్సిటీ ర్యాంకు సాధించిన జమ్ముల ఉమా భార్గవిని మంగళవారం ఘనంగా సత్కరించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ వేడుకల్లో ప్రిన్సిపల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతోపాటు క్రీడా సాంస్కృతిక పోటీల్లో కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. చక్కగా చదువుకొని భార్గవి స్ఫూర్తితో మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.