calender_icon.png 4 November, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుని జ్ఞాపకార్ధంగా ఉచిత వైద్య శిబిరం

04-11-2025 07:56:36 PM

చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గత నెల 23 తేదీ న అకాల మరణం చెందిన రుద్రరపు చందు జ్ఞాపకార్ధంగా ఉచిత వైద్య శిబిరాన్ని  ప్రగ్మ హాస్పిటల్, లాలిత్యం హాస్పిటల్ వారి ఆధ్వర్యం లో చిన్నకపర్తి గ్రామంలో  నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మాజీ సర్పంచ్ బోయపల్లి వాణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహితుడు చందు జ్ఞాపకార్ధంగా మిత్రులు చేసిన ఈ వైద్య శిబిరంలో ఉచితంగా వైద్యం చేసి మందులు గ్రామ ప్రజలకు అందజేశామని,  మున్ముందు ఇలాంటి కార్యక్రమంలో కొనసాగిస్తామన్నారు.