calender_icon.png 4 November, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి మనసు చాటుకున్న రాజగోపాల్ రెడ్డి

04-11-2025 07:59:06 PM

పేద విద్యార్థులైన అక్క-చెల్లెకు రూ.3.25 లక్షల ఆర్థిక సహాయం అందజేత..

నకిరేకల్ (విజయక్రాంతి): నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన ఎర్ర రాజు-చైతన్య దంపతుల రెండోవ కుమార్తె ఎర్ర శ్రీలిఖ్య ములుగు ప్రభుత్వ గవర్నమెంటు కళాశాలలో ఎంబిబిఎస్ లో సీట్ పొందింది. కానీ ఎంబిబిఎస్ పూర్తిచేసేందుకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉండడంతో శాలిగౌరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైరన్ పాదూరి శంకర్ రెడ్డి ఈ విషయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం పట్ల స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శ్రీలిఖ్య ఎంబిబిఎస్ ను పూర్తి చేసే అంతవరకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆర్థికంగా ఫీజులను చెల్లిస్తానని భరోసా ఇచ్చి మొదటి సంవత్సరానికి చెల్లించవలసిన ఫీజును రూ.1.25 లక్షల రూపాయలను అందజేశారు.

అదేవిధంగా పెద్ద కుమార్తె శ్రీ అలేఖ్య పై చదువుల కోసం కూడా రూ.2 లక్షల రూపాయలను అందజేశారు. చదువులో అత్యున్నతంగా రాణించే పేద విద్యార్థులందరికీ అండగా ఉంటానని ఏ సమస్య ఉన్న తమ వద్దకు రావాలని విద్యార్థులకు సూచించారు. పెద్దమనసు చేసుకొని మా బిడ్డలకు ఆర్థిక సహాయం అందించిన రాజగోపాల్ రెడ్డికి విద్యార్థినుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరిశంకర్ రెడ్డి, ఎర్ర రాజు చైతన్య, విద్యార్థినిలు పాల్గొన్నారు.