04-11-2025 07:54:28 PM
నకిరేకల్ (విజయక్రాంతి): 69వ ఉమ్మడి నలగొండ జిల్లా అండర్-14 హ్యాండ్ బాల్ జట్టుకు మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలకు చెందిన ఎస్.కె నస్రిన్ ఎంపికైందని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం కట్టంగూరు మండల పరిధిలోని చెరువు అన్నారం హైస్కూల్లో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్గొండ హ్యాండ్ బాల్ సెలక్షన్ లో అండర్-14 విభాగంలో మంచి ప్రతిభ కనబరిచి ఉమ్మడి నల్గొండ జిల్లా హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపికైనదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హ్యాండ్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని ఎస్.కె నస్రిన్, వ్యాయామ ఉపాధ్యాయుడు బొడ్డు మల్లేష్ ను ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, ఉపాధ్యాయ బృందం తదితరులు అభినందించారు.